ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

by Bhanu |

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ, గరిడేపల్లి : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రధాని వెంకన్న(38) శనివారం రాత్రి కిరాణా సరుకులు తీసుకుని తన యెక్క ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళ్ళే క్రమంలో గుండాలమ్మ గుడి ముందు యూ టర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో హుజూర్ నగర్ నుండి నేరేడుచర్ల వైపు వెళ్తూన్న కార్ డ్రైవర్ అధిక వేగంతో వెళ్లి టక్కర్ ఇవ్వడంతో వెంకన్న రెండు కాళ్లకు బలమైన గాయాలు తగిలాయి. వెంకన్న కుమార్తె పుష్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.

Next Story