- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గరిడేపల్లి లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లోపల వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ నుంచి స్టవ్ కు ఉన్న పైపు ఊడిపోవడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లోపల గ్యాస్ సిలిండర్ ఉండడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే స్థానిక ట్రైనీ ఎస్ఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ధైర్యంతో లోపలికి వెళ్లి సిలిండర్ ను ఆఫ్ చేశారు.
దీంతో మంటలు వ్యాప్తి తగ్గింది. వెంటనే నీళ్లతో పోలీసిబ్బంది మంటలు అర్పివేశారు. అంతకుముందు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు జనం వ్యక్తం చేశారు. లోపల గ్యాస్ సిలిండర్లు ఉండడంతో మంటలాపేందుకు ఎవరు సాహసించలేకపోయారు. ఎస్ఐ సురేష్ రెడ్డి తమ పోలీస్ సిబ్బందితో కలిసి ధైర్యంతో ముందుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెలరేగిన మంటలతో లోపల ఉన్న కుర్చీలు, టేబుళ్లు, 13వేల రూపాయల నగదు, వంట మాస్టర్ రాజుకు సంబంధించిన ఇంటి పట్టా కాగితాలు ఇతర గుర్తింపు కార్డులు అన్ని పూర్తిగా తగలబడిపోయాయి. దీంతోపాటు హోటల్లో ఉన్న కరెంటు బోర్డులు వైర్లు ముద్దగా మారాయి. పోలీసులు ధైర్యం చేసి మంటను ఆర్పిన తీరును అక్కడ ఉన్న జనం అభినందించారు. మొత్తంగా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






