- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యసనాల కోసం ద్విచక్ర వాహనాల చోరీ.. ముఠా అరెస్ట్
మిర్యాలగూడ పట్టణంలో వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణంలో వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.38 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఏపీ-24-జీ-5587 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరగా, వాహనదారులు ఎలాంటి ధ్రువపత్రాలు చూపలేకపోయారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మిర్యాలగూడ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. మద్యం సేవించడం, గుట్కా వినియోగించడం, పేకాట ఆడటం వంటి చెడు వ్యసనాల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు ,రూ.38 వేల నగదు స్వాధీనం
చోరీ చేసిన వాహనాలను దామచర్ల ప్రాంతంలో పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్న కంచరకుంట్ల సుమలతకు విక్రయిస్తున్నట్లు వారు వెల్లడించారు. దీంతో కంచరకుంట్ల సుమలతను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను రూ.2,500 నుంచి రూ.3,000 వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని విడిభాగాలుగా విభజించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చోరీ వాహనాల విక్రయం ద్వారా వచ్చిన రూ.1.38 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, గతంలో కూడా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో కొంగారి నవీన్‌కుమార్, సోమిరెడ్డి సైదిరెడ్డి, కంచరకుంట్ల సుమలతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ రెండో పట్టణ సీఐ సోమనర్సయ్య, ఏఎస్ఐ షేక్ గఫర్, హెడ్ కానిస్టేబుల్ ఆర్. స్వర్ణనాయక్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, కళ్యాణ్, సూర మణిదీప్, సయ్యద్ సమ్మద్, ఎన్.టి. అక్బర్‌బాషా, రామకృష్ణ, రాజశేఖర్, లక్ష్మీకర్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగభూషణరావు ఎస్సై సతీష్ హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ, టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు






