- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు.. KGBV ఉద్యోగ నోటిఫికేషన్‌లో కీలక మార్పు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు సమగ్ర శిక్ష అభియాన్ గుడ్ న్యూస్ చెప్పింది. కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 299 ప్రిన్సిపాల్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు వెల్లడించారు.
‘టెట్’ నుంచి తాత్కాలిక మినహాయింపు..
ప్రస్తుతానికి అభ్యర్థులందరికీ టెట్ అర్హత నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, టెట్ లేని అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపికై విధుల్లో చేరిన తర్వాత ఓ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపు ఖచ్చితంగా టెట్ అర్హత సాధించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ గడువులోగా టెట్ క్వాలీఫై కాకపోతే వారి సేవలను నిరభ్యంతరంగా నిలిపివేస్తామని. అదేవిధంగా అర్హులై అభ్యర్థులు కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు పొడిగించినట్లుగా ఎస్పీడీ శ్రీనివాసరావు ప్రకటించారు.






