బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..

by Kodari Anjali |

బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..
X

దిశ, కాప్రా: బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని మహమ్మదీయ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది యువకులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని విశ్వసించి పలువురు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ గౌడ్, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story