అక్రమ హుక్కా కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసుల సోదాలు..

by Taduka Kalyani |

మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అక్రమ హుక్కా కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసుల సోదాలు..
X

దిశ, సిటీక్రైం : మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిబంధనలకు విరుద్ధంగా హుక్కా కేంద్రాలను నడిపిస్తున్నారని ఆధారాలు సేకరించిన పోలీసులు 14 కేంద్రాల నిర్వాహకుల పై నాలుగు కేసులను నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు. కేప్ ల ముసుగులో ఈ హుక్కా కేంద్రాలను గుట్టుగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హుక్కా కేంద్రాలను నిర్వహించడం చట్టవిరుద్ధమని, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హుక్కా కేంద్రాల నిర్వహణ పై సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. కేప్ లు నిర్వహించేందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story