ఫతేనగర్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష..

by Kodari Anjali |

ఫతేనగర్ డివిజన్‌లోని ప్రజా సమస్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఫతేనగర్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష..
X

దిశ, బాలానగర్: ఫతేనగర్ డివిజన్‌లోని ప్రజా సమస్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్‌తో కలిసి స్థానిక సమస్యలను పరిశీలించారు.సమావేశానికి ముందు దీనదయాళ్ నగర్ బ్రిడ్జి, ఆర్‌యూబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శివనగర్‌లో ఆర్‌యూబీ నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమీక్షలో డ్రైనేజీ, వీధిలైట్లు, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, స్మశానవాటిక అభివృద్ధి తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, అవసరమైన పనులకు అంచనాలు సిద్ధం చేసి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story