- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS AFG, 2nd ODI: రోహిత్ కు గాయం..రంగంలోకి మరో డేంజర్ ఓపెనర్ !
రోహిత్ శర్మకు గాయం అయిన తరుణంలో మరో డేంజర్ ఓపెనర్ ను రంగంలోకి దింపనున్నారని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య రేపు రెండో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొదటి వన్డేలో రనౌట్ అయిన రోహిత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. అతని మణికట్టుకు గాయం అయిన నేపథ్యంలో రెండో వన్డే నుంచి తప్పించనునట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రేపటి మ్యాచ్ ఒక్కటే కాకుండా సిరీస్ నుంచి తప్పించేందుకు సిద్ధం అయ్యారట. ఇంగ్లాండ్ తో త్వరలో వన్డే సిరీస్ ఉన్న క్రమంలో, రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ కూడా గాయం కారణంగా ఆఫ్గనిస్తాన్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే బాట పట్టాడు. కాగా రేపు జరగనున్న రెండో వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.
భారత జట్టు అంచనా
భారత్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (wk), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గురునూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.






