- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
by Taduka Kalyani |
తండ్రి మందలించడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, రామన్నపేట : తండ్రి మందలించడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై డి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక గ్రామానికి చెందిన కంబాలపల్లి సాయి చరణ్ (23) తన పాత ఇంట్లో ఎవరూ లేనిది చూసి చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి ఏ పని చేయట్లేదని తండ్రి మందలించడంతో సోమవారం రాత్రి దాదాపు 8:30 గంటల సమయంలో మనస్థాపం చెంది ఆత్మహత్య పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






