పనిమనిషిని గర్భవతిని చేసిన వ్యాపారి కొడుకు..

by Kodari Anjali |

ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల యువతికి ప్రేమంటూ మాయమాటలు చెప్పి ఓ నగల వ్యాపారి కొడుకు మూడు నెలల గర్భవతిని చేసి.. చివరకు మోసం చేశాడు.

పనిమనిషిని గర్భవతిని చేసిన వ్యాపారి కొడుకు..
X

దిశ, కోసిగి: ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న 20 ఏళ్ళ అమ్మాయితో మాయ మాటలు చెప్పి వంచించి ఏకంగా మూడు నెలల గర్భవతిని చేసిన ఓ వ్యాపారి కొడుకు సంఘటన కొడంగల్ నియోజకవర్గం కోసిగి పట్టణంలో చోటుచేసుకుంది. కోస్గి పట్టణానికి చెందిన బంగారు నగల వ్యాపారి కుమారుడు సాయి కృష్ణ తన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న 20 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయితో చనువుగా ఉంటూ ప్రేమ పేరుతో మాటలు కలుపుతూ వంచించి మూడు నెలల గర్భవతి చేశాడని, తనను డబ్బులు వద్దని, పెళ్లి చేసుకోవాలని సదరు యువతి వ్యాపారి కొడుకు సాయికృష్ణను కోరడంతో నిరాకరించాడని, నా జీవితం నాశనం చేశాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ కోస్గి పోలీసులను ఆశ్రయించింది.

అట్రాసిటీ కేసు నమోదు..

రంగంలోకి దిగిన సాయి కృష్ణ తండ్రి వ్యాపారి కావడంతో స్థానిక నాయకుల జోక్యంతో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని తెలియజేయడంతో కేసు నమోదులో జాప్యం చోటుచేసుకుంది. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టడంతో చేసేదిలేక పోలీసులు సైతం కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇదే విషయమై దిశ స్థానిక ఎస్సై పురుషోత్తంను వివరాలు కోరగా కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలని జిల్లా కేంద్రానికి తరలించామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Next Story