జీ-7 సదస్సులో మోడీ, ట్రంప్ కరచాలనం.. 16 నెలల తర్వాత ఇరు నేతల తొలి భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-16 14:29:31  IST  )

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్డో నాల్డ్ ట్రంప్ పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.

జీ-7 సదస్సులో మోడీ, ట్రంప్ కరచాలనం.. 16 నెలల తర్వాత ఇరు నేతల తొలి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌ (France)లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ-7 (G7) శిఖరాగ్ర సదస్సు వేదికగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం ట్రంప్, ప్రధాని మోడీ భుజం తట్టి ఆప్యాయంగా పలుకరించారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతలు ఒకరినొకరు కలుసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, పరస్పర సహకారంపై ఇరు నేతలు క్లుప్తంగా చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదీ-ట్రంప్‌ల భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story