పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. 10 మంది పట్టివేత

by Bhanu |

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కట్టవారి గూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న గుంపుపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. 10 మంది పట్టివేత
X

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కట్టవారి గూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న గుంపుపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడి పేకాట స్థావరాన్ని గుర్తించిన పోలీసులు దాడి జరిపారు.

ఈ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న కట్టవారిగూడెం గ్రామానికి చెందిన పట్టేటి శ్రీకాంత్, రాయిరాల కొండలు, గోపీచంద్, పూసపాటి వినయ్, గాంధీ భాస్కర్, లేత సురేష్, పఠాన్ సైదా, రాయిరాల గోపి, గండమళ్ళ వెంకన్న, మీసాల శివాజీ, దార రాజు, పఠాన్ మహబూబ్ అలీ, బాల్దురి వెంకటయ్యలను గుర్తించారు. వీరిలో ముగ్గురు పారిపోయినప్పటికీ మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిదగ్గర నుంచి 7 మోటార్ బైకులు, 7 సెల్‌ఫోన్లు, ₹4,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు.

Next Story