ఓటు కోసం అమెరికా నుంచి కొత్త‌ప‌ల్లికి

by Nallavelli.Anjaneyulu |

దిశ, హాలియా : రెండో విడత పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా గ్రామ‌పంచాయ‌తీ ఓట‌ర్లు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు

ఓటు కోసం అమెరికా నుంచి కొత్త‌ప‌ల్లికి
X

దిశ, హాలియా : రెండో విడత పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా గ్రామ‌పంచాయ‌తీ ఓట‌ర్లు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప‌లు ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల‌కు వ‌చ్చిన ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకొని తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఇందులో భాగంగా అనుముల మండ‌లం కొత్త‌ప‌ల్లి గ్రామంలో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు గ్రామానికి చెందిన యువ‌కుడు స‌జ్జ‌ల ముర‌ళీద‌ర్ రెడ్డి అమెరికా నుంచి సొంత గ్రామానికి వ‌చ్చాడు. అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా ప‌ని చేస్తున్నాడు. త‌న అభిమాన అభ్య‌ర్థికి ముర‌ళీధ‌ర్ రెడ్డి ఓటు వేసేందుకు అమెరికా నుంచి వ‌చ్చాడు. ఖండాల‌ను దాటి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ప‌ట్ల స్నేహితులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story