- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నక్కగూడెంలో హెల్త్ సబ్ సెంటర్ కు శంకుస్థాపన
చింతలపాలెం మండలంలోని నక్కగూడెం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ

దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండలంలోని నక్కగూడెం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ..ఈ హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుతో నక్కగూడెం ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు గ్రామంలోనే అందుబాటులోకి వస్తాయని ఇంత మంచి కార్యక్రమానికి స్థలాన్ని అందించినటువంటి తోట అంజయ్య,మల్లోజు శంకరాచారి ని అభినందించారు.
ఈ సబ్ సెంటర్ నిర్మాణానికి కావలసిన 20 లక్షల రూపాయలను 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి మంజూరు చేయించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జామా చొక్లా నాయక్, మాజీ సర్పంచ్ బాదే కాశయ్య, చిలకల శ్రీనివాసరెడ్డి, లకావత్ సైదులు, దేశినేని రామారావు, నాగేశ్వరరావు, లాలు, రుక్మా నాయక్, పప్పుజాన్, దాదాపుడే, తొండపు శ్రీనివాసరెడ్డి, సైది హుస్సేన్, తిరుపతిరావు, బత్తుల సైదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దొంగల కార్తీక్,ఏఎన్ఎం, ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.






