గదులకు పెయింటింగ్ వేయించిన పూర్వ విద్యార్థులు..

by Kodari Anjali |

తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థులంతా కలిసి గదులకు పెయింటింగ్ వేయించారు.

గదులకు పెయింటింగ్ వేయించిన పూర్వ విద్యార్థులు..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. 21 సంవత్సరాల అనంతరం ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, శ్రీనివాస్, దినేష్, అరుణ, వినీలలను పూలమాలలతో సన్మానించారు. పూర్వ విద్యార్థుల ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ.. తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు గుర్తుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత నిధులతో పాఠశాల తరగతి గదులకు పెయింటింగ్ వేయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి భోజనాలు చేసి, రోజంతా ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో కే. చంద్రశేఖర్, విజయ్, పాండు, సిద్ధులు, కల్పన, సుమలత, జ్యోతి, విశాల, కీర్తి తదితరులు పాల్గొన్నారు. 21 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంతో పాటు విడిపోతున్న సమయంలో భావోద్వేగానికి లోనవుతూ తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.

Next Story