కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి : మాజీ ఎంపీ

by Disha Web |
కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి : మాజీ ఎంపీ
X

దిశ, చౌటుప్పల్: మునుగోడు ప్రజలు ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చౌటుప్పల్ రూరల్ మండల బీజేపీ ఇంచార్జి గా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాణి రుద్రమ హాజరయ్యారు. అనంతరం జితేందర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 21న మునుగోడు లో జరిగే అమిత్ షా సభకు భారీగా ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని అన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ రూరల్ నుండి 12,000 మంది జన సమీకరణ చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని నాయకులకు సూచించారు. ప్రతి బూత్ నుండి 300 మందికి తగ్గకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దూడల బిక్షం, బీజేపీ మండల అధ్యక్షుడు రిక్కల సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story