ప్రజలే కుటుంబమన్న కాంగ్రెస్ నేతలు.. గద్దెనెక్కాక గాలికొదిలేశారు!

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య‌. ఆదివారం తన నివాసుల ఏర్పాటు చేసిన విలేక‌ర్ల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలే కుటుంబమన్న కాంగ్రెస్ నేతలు.. గద్దెనెక్కాక గాలికొదిలేశారు!
X

దిశ‌, కోదాడ : కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య‌. ఆదివారం తన నివాసుల ఏర్పాటు చేసిన విలేక‌ర్ల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిస్టుల్లా నియోజకవర్గానికి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ కుటుంబాన్ని వీధిన పడేశారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు కోదాడ నియోజకవర్గానికి టూరిస్టుల్లా వచ్చి వెళ్లడమే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి మండలానికి ఒక్కో షాడో ఎమ్మెల్యేను నియమించి, వెనుకబాటుగా పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికార మదంతో ప్రతిపక్షాలపై కేసుల వేటఅధికార మదంతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, విపక్ష స్వరాలను అణిచివేసే కుట్రలో కాంగ్రెస్ నిమగ్నమైందన్నారు.

కర్ల రాజేశ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం..

కర్ల రాజేశ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దోషులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. యూనిఫాం వేసుకున్న గుండాలను ఊరుకునేది లేదు. యూనిఫాం వేసుకున్న గుండాల ఆగడాలను బీఆర్ఎస్ సహించదని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. మామూలు మత్తులో వ్యవహరిస్తున్న కోదాడ టౌన్ సీఐ శివశంకర్ నాయక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాలాజీ నగర్‌లోని 570 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు గత ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. తమకు కేటాయించిన ఇళ్లలో పూజలు చేసుకుంటే పోలీసులు, అధికారులు లబ్ధిదారులను వేధించడం అన్యాయమని మండిపడ్డారు. ఇది పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు.గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన నోటీసులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మొత్తంగా కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని, అధికార దురహంకారానికి ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.

Next Story