- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను రైతులకు సరఫరా చేయాలి: మాజీమంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర రైతులకు 24 గంటల నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ ను ప్రభుత్వం అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

దిశ, బొమ్మలరామరం: తెలంగాణ రాష్ట్ర రైతులకు 24 గంటల నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ ను ప్రభుత్వం అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బొమ్మల రామారం మండలంలోని సోలిపేట గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను శుక్రవారం సందర్శించి రైతులకు సప్లయి అవుతున్న విద్యుత్ సమయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ సరఫరా చేయడం లేదని అడుగుతే దేవాదుల ప్రాజెక్టు లో 9మోటార్లు కు 5 మోటర్లు నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రములో1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ పవర్ ప్లాంటులు నిర్మించి ఇస్తే వాటిని నడపడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు చేతనకావడం లేదన్నారు. వరంగల్ సభలో మంత్రి బట్టి విక్రమాక్ర మాట్లాడుతూ...
రైతులకు ఉచితంగా ఇవ్వడం ఇష్టం లేక...
రైతులకు విద్యుత్ నిరంతరం ఇసున్నమని చెప్పాడని కాని రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్లు ముందు రైతులు ధర్నా ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నా రు. రాష్ట్రం వ్యాప్తంగా 4వేల మంది రైతులకు రైతు భీమాను ఇంకా చెల్లించడం లేదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, గొర్రెలు, చేపల పంపిణి చేపట్టాక పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 23 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న రైతులకు ఉచితంగా ఇవ్వడం ఇష్టం లేక ఉత్పతి చేయడం లేదన్నారు. అనంతరం ఇటీవల మరణించిన నాగినేనిపల్లి గ్రామానికి చెందిన కట్టసాయి రెడ్డి రోడ్లు ప్రమాదంలో మరణించాడు. ప్యారారం గ్రామం మాజీ సర్పంచ్ పూడూరి నవీన్ గౌడ్ కు మాతృ వియోగం జరిగింది. వారి కుటుంబాలకు పరమర్చిచించి, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మండల నాయకులు పాల్గొన్నారు.






