- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలి : తహశీల్దార్ వరప్రసాద్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని శాలిగౌరారం తహశీల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు.

దిశ, శాలిగౌరారం : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని శాలిగౌరారం తహశీల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు. మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందని,ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని కోరారు. చలికాలం లో డెంగ్యూ,మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వస్తున్నాయని.. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థుల తో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమం లో ఎంఈవో మందుల సైదులు,హాస్టల్ ఇంచార్జ్ వార్డెన్ శంకర్ రెడ్డి,జీ పీ వో యాదయ్య పాల్గొన్నారు.






