- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలగిరిలో ఫ్లైఓవర్ పనులు ఆపాలి
తిరుమలగిరి మీదుగా వలిగొండ - తొర్రూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా తిరుమలగిరి పట్టణ కేంద్రంలో సోమవారం ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ అక్కడికి చేరుకొని ప్రజలు సామాజిక కార్యకర్తలు వ్యాపారస్తులు అందరూ కలిసి పనులను అడ్డుకుని అధికారులతో మాట్లాడారు.

తిరుమలగిరిలో ఫ్లైఓవర్ పనులు ఆపాలి
పనులను అడ్డుకున్న వ్యాపారస్తులు, సామాజిక కార్యకర్తుల
రోడ్డుపై ధర్నా, నిరసన
దిశ,తిరిమలగిరి: తిరుమలగిరి మీదుగా వలిగొండ - తొర్రూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా తిరుమలగిరి పట్టణ కేంద్రంలో సోమవారం ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ అక్కడికి చేరుకొని ప్రజలు సామాజిక కార్యకర్తలు వ్యాపారస్తులు అందరూ కలిసి పనులను అడ్డుకుని అధికారులతో మాట్లాడారు. ప్రజలు,వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సెంటర్ లో మోత్కూరు-తొర్రూరు రోడ్డు ఫ్లై ఓవర్ నిర్మాణం ఆపాలని వ్యాపారస్తులు,చిరువ్యాపారులు,తోపుడు బండ్ల వ్యాపారులు,ప్రజలు,సామాజిక సంఘాల నాయకులు అనేకసార్లు దేశంలో వ్యక్తం చేసిన సంగతి విధితమే అయినా అధికారులు అవేమి పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు,కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్యను తెలుసుకుని ఫ్లై ఓవర్ నిర్మాణం బంద్ చేయాలని అవసరమైతే రోడ్డు విస్తరణ చేపట్టి ప్రమాదాలు జరగకుండా సెంటర్ లో సర్కిల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్,సామాజిక తెలంగాణ మహాసభ కన్వీనర్ కొత్తగట్టు మల్లన్న,కిరాణం షాపు అసోసియేషన్ అధ్యక్షులు గుండా భాస్కర్,గజ్జెల రమేష్, యెల్సోజు భాస్కర్, నాని, శ్రీహరి, రచ్చ రమేష్, కిరణ్, క్రిష్ణ , అనగందుల మల్లేష్, ఉపేందర్, వీరమ్మ, రేణుక, ఉదయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు






