నిప్పుంటుకొని దగ్దమైన కంది పంట

by Nallavelli.Anjaneyulu |

కంది పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ద‌మైన ఘటన రాజంపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిప్పుంటుకొని దగ్దమైన కంది పంట
X

దిశ, రాజంపేట : కంది పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ద‌మైన ఘటన రాజంపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆర్గోండ స్వామి అనే రైతు తనకున్న వ్యవసాయ భూమిలో ఒక ఎకరం కంది పంటను సాగు చేశారు. ప్రమాదవశాత్తు కంది పంటకు నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. డంపింగ్ యార్డ్ సమీపంలో ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ కి నిప్పంటించడంతో ఆ మంట క్రమంగా కంది చేనులోకి వ్యాపించి పంట మొత్తం కాలిపోయిందని రైతు వాపోయాడు. పంట చేతికి వచ్చిన దశలో పంట కాలిపోవడంతో రైతుకు నష్టం వాటిలింది. పూర్తిస్థాయిలో ఎదిగిన ఒక ఎకరం కంది పంట నాశనం కావడంతో ఆర్థికంగా త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆర్గోండ స్వామి తెలిపారు. సంఘటన స్థలాన్ని అధికారులు పరిశీలించి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Next Story