- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మలగూడెంలో ఫ్లాగ్ మార్చ్
by Bhanu |
తుమ్మలగూడెం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు

X
దిశ, రామన్నపేట: మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రధాన వీధులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు కోరారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
- Tags
- nalgonda
Next Story






