- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్ట్రీట్ వెండర్ లకు ఆర్థిక చేయూత.. మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి
చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిది ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి తెలిపారు.

దిశ, హాలియా : చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిది ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి తెలిపారు. గురువారం హాలియా పురపాలక సంఘ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ ఫెడరేషన్ (టిఎల్ఎఫ్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రీట్ వెండర్ల ఆర్థిక చేయూత కోసం పాలక ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందని రోజువారీ ఆదాయాలతో చిరు వ్యాపారులు, పట్టణ పేదలు ప్రభుత్వ నుంచి రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.
రుణాలు పొందిన వ్యాపారులు తిరిగి సకాలంలో చెల్లించినట్లయితే తదుపరి దశల్లో అధిక మొత్తంలో రుణాలు అందించే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెప్మా పిడి శ్రీనివాసం మాట్లాడుతూ పట్టణంలోని వివిధ స్వయం సహాయక సంఘాలలో ఉన్న సభ్యులను గుర్తించి వారికి అనుకూలమైన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు మెప్మా సహాయపడుతుందని తెలిపారు. పట్టణ పేదల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్, డీఎంసీ శివాజీ, టీఎంసీ పద్మ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






