మృతుల కుటుంబీకులకు పదివేల చొప్పున ఆర్ధిక సహాయం

by velandi.Saikiran |

మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మృతి చెందిన మృతుల కుటుంబాలకు నాంపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు

మృతుల కుటుంబీకులకు పదివేల చొప్పున ఆర్ధిక సహాయం
X

దిశ, మర్రిగూడ ( నాంపల్లి) : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మృతి చెందిన మృతుల కుటుంబాలకు నాంపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి పదివేల రూపాయల చొప్పున అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు ధనయ్యచార అనారోగ్యంతో మృతి చెందాడు . అలాగే లక్ష్మణపురం గ్రామానికి చెందిన దెప లలితమ్మ అనారోగ్యంతో మరణించింది. ఇరువురీ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం ఆయా కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బెక్కం రమేష్,మాజీ ఉప సర్పంచ్ చెవుల రఘుమారెడ్డి,ఆవుల వెంకటయ్య,నలుపు వెంకటేశ్వర్లు,గడ్డి పుల్లయ్య తదితరులు ఉన్నారు.

Next Story