ప్రైవేటు ఉపాధ్యాయిని చికిత్సకు ఆర్థిక సాయం

by Nallavelli.Anjaneyulu |

దిశ, రామన్నపేట : మండల కేంద్రంలోని డాన్ బాస్కో స్కూల్‌లో గత పదేళ్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయునిగా సేవలందించిన హరిశంకర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కా

ప్రైవేటు ఉపాధ్యాయిని చికిత్సకు ఆర్థిక సాయం
X

దిశ, రామన్నపేట : మండల కేంద్రంలోని డాన్ బాస్కో స్కూల్‌లో గత పదేళ్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయునిగా సేవలందించిన హరిశంకర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అపస్మారక స్థితిలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స వ్యయం లక్షల్లో ఉండటంతో, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి సహాయం అందించాలనే దృక్పథంతో వివేకానంద మోడల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేతులు కలిపి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా రూ. 32,742 మొత్తాన్ని హరి శంకర్ కుమారుడు, కుమార్తెలకు అందజేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, హరి శంకర్ సార్ ఆరోగ్యం త్వరగా కుదుటపడేందుకు ఈ ప్రకటన చదివిన వారు కూడా మీ వంతు సహకారం అందించాలని పాఠశాల ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. సహాయాన్ని అందించదలచిన వారు PhonePe 8985975380 (Shashank)/9381430449 ద్వారా పంపవచ్చు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం తరఫున మల్లికార్జున్, ఉపాధ్యాయులు అస్మ, మల్లేష్, నాగరాజు, ముత్యాలు, అస్మతునీస,సునీత, మమత, అనిత, గాయత్రి, సరిత పాల్గొన్నారు.

Next Story