కుల మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలి

by Naveena |

కులమత తారతమ్య భేదం లేకుండా పండగలను జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

కుల మతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలి
X

దిశ, మిర్యాలగూడ : కులమత తారతమ్య భేదం లేకుండా పండగలను జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మసీదులో ప్రార్థన చేసిన ముస్లింలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరి పండగలను ఒకరు గౌరవించుకుంటూ విభేదాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల్ల శ్రీనివాస్, కొమ్ము శ్రీనివాస్, దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, గోదాల జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story