- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చోరీలు చేస్తున్న ఆడ దొంగ అరెస్టు
నల్లగొండ బస్టాండ్ పరిసరాల్లో కొన్ని రోజులుగా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలు, బ్యాగ్ కటింగ్‌లకు పాల్పడుతున్న కిలాడి లేడీని నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ బస్టాండ్ పరిసరాల్లో కొన్ని రోజులుగా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలు, బ్యాగ్ కటింగ్‌లకు పాల్పడుతున్న కిలాడి లేడీని నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మగవేషం దరించి అమాయక ప్రయాణికులను మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆడ దొంగపై పలువురు బాధితులు టూ టౌన్ ఎస్‌ఐ వై. సైదులుకు ఫిర్యాదులు చేయడంతో, ఆయన వెంటనే స్పందించి క్రైమ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతోవారు రంగంలోకి దిగగా, కానిస్టేబుల్ శంకర్, లావూరి బాలకోటిలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విస్తృత విచారణ చేపట్టారు. చాకచక్యమైన దర్యాప్తు ఫలితంగా ఘరానా కిలాడి లేడీగా పేరుగాంచిన పసుపులేటి రేణుకతో పాటు ఆమె సహచరుడు అరవింద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించి నేరాన్ని ఛేదించిన టూ టౌన్ ఎస్‌ఐ సైదులును, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ విజయ, కానిస్టేబుల్ లావూరి బాలకోటిలను డీఎస్పీ అభినందించారు.






