పిడుగు పాటుతో మహిళా రైతు మృతి...

by Bhanu |

నల్లగొండ మండలం అప్పాజిపేట పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు జాల భిక్షవమ్మ (46) మృతి చెందింది.

పిడుగు పాటుతో మహిళా రైతు మృతి...
X

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ మండలం అప్పాజిపేట పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు జాల భిక్షవమ్మ (46) మృతి చెందింది. వ్యవసాయ బావి వద్ద తోటలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో ఆమెపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామంలో పిడుగుపడడంతో రైతులు, కూలీలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story