నిమజ్జనం కోసం వెళ్లి... తండ్రి, కొడుకులు గల్లంతు

by velandi.Saikiran |

వినాయకుని నిమజ్జనం కోసం వచ్చి... తండ్రి, కొడుకులు గల్లంతు అయిన సంఘ‌ట‌న‌ వేములపల్లి మండల కేంద్రంలో శుక్రవారం

నిమజ్జనం కోసం వెళ్లి... తండ్రి, కొడుకులు గల్లంతు
X

దిశ, మిర్యాలగూడ (వేములపల్లి) : వినాయకుని నిమజ్జనం కోసం వచ్చి... తండ్రి, కొడుకులు గల్లంతు అయిన సంఘ‌ట‌న‌ వేములపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది.తండ్రి, కొడుకులు ఇద్దరు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గల్లంత‌య్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామానికి చెందిన పున్నా సాంబయ్య (50) భార్య చంద్రకళ గత 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దింతో కుమారుడు శివమణి (20), కూతురు నందినితో కలిసి వంట మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు సాంబయ్య. కాగా శుక్రవారం వినాయకుని నిమజ్జనం కోసం తండ్రి సాంబయ్య, కుమారుడు శివమణి పలువురు గ్రామస్తులు కలిసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. ఇక ఈ నిమజ్జనం అనంతరం కాలువలో సాంబయ్య... స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అక్కడే ఉన్న శివమణి... తండ్రిని కాపాడబోయి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో తండ్రి, కొడుకులు గల్లంతు అయిన సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో తండ్రి కొడుకులు గల్లంతయిన విష‌యం తెలుసుకున్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గజ ఈతగాలతోపాటు రిస్క్యూ టీమ్ ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. చిన్నతనంలోనే త‌ల్లి మృతి చెందడం... అండగా ఉంటారనుకున్న తండ్రి, అన్న గల్లంతు కావడంతో చిన్నారి ఒంటరి అయింది.

Next Story