రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి

by Naveena |

తిరుమలగిరి వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణపై శుక్రవారం రైతు సోదరులతో సమావేశం మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు నిర్వహించారు.

రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ ,తిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ యాంత్రీకరణపై శుక్రవారం రైతు సోదరులతో సమావేశం మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు నిర్వహించారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులు యంత్ర పరికరాలు సబ్సిడీ ద్వారా రైతులకు అందించడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 2024-25 వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు చేతి బ్యాటరీ పంపు, పవర్ స్పేర్స్,రోటోవేటర్స్,కల్టివేటర్స్,గడ్డి చుట్టూ యంత్రము,సబ్సిడీతో కావలసినవారు ఈనెల 31 వరకు దరఖాస్తు స్వీకరించుటకు చివరి గడువు ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తు పత్రాలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ దరఖాస్తుకు మహిళా రైతులు మాత్రమే అర్హులని సంబంధిత వాహన ఆర్సి పుస్తకము,పట్టాదారు పాస్బుక్ మహిళా రైతుల పేరుమీద ఉండాలని,ఆధార్ కార్డ్,పాస్ ఫోటో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు.

Next Story