రైతులకు గుడ్ న్యూస్.. 48 వేల యూరియా బస్తాలు సరఫరా

by Bhoopathi Nagaiah |

యూరియాపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కావలసినంత స్టాక్ సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. 48 వేల యూరియా బస్తాలు సరఫరా
X

దిశ,సంస్థాన్ నారాయణపురం: యూరియాపై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కావలసినంత స్టాక్ సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పిఏసిఎస్ లో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సరంలో ఈ సీజన్ కు 23,000 బస్తాలు సరఫరా అయ్యాయని, ఈ సీజన్ లో ఇప్పటికే మండలానికి 48,000 బస్తాలను సరఫరా చేశామని అన్నారు. మరో 20,000 బస్తాలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందకుండా అవసరం లేకుండా యూరియా బస్తాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.

కొందరు రైతులు వచ్చే సీజన్ కు కూడా ఇప్పటినుండి నిల్వలు ఉంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూరియా నిల్వలు కావాల్సినంత ఉన్నాయని రైతులు ఎవరూ కూడా అవసరానికి మించి యూరియా బుక్ చేసుకోవద్దని సూచించారు. వచ్చే సీజన్ కు కూడా కావలసినంత యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. రైతులు గాబరా పడి వదంతులు నమ్మి యూరియా పై ఆందోళన చెందోదని అన్నారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారిని బి.పూజ, పిఏసిఎస్ సిఈఓ బి.శేఖర్, రైతులు నోముల మాధవరెడ్డి, ఏపూరి సతీష్, జక్కిడి చంద్రారెడ్డి, బొడ్డుపల్లి యాదయ్య లు పాల్గొన్నారు.

Next Story