రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి: మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు

by I. Sairam |

రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని , వ్యవసాయ అవసరాల కోసం సరఫరా చేయబడే యూరియా ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానాన్ని అమలు చేస్తోందని, ఈ విధానం ప్రకారం రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగా యూరియా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.

రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి: మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు
X

దిశ, చివ్వెంల: రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని , వ్యవసాయ అవసరాల కోసం సరఫరా చేయబడే యూరియా ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానాన్ని అమలు చేస్తోందని, ఈ విధానం ప్రకారం రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగా యూరియా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. బుకింగ్ చేసిన రైతులకు మాత్రమే సమీపంలోని ఎరువుల దుకాణాల ద్వారా యూరియా అందజేయబడుతుందని మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం చివ్వెంల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానం గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ సూర్యాపేట జిల్లాలో తేది 28-01-2026 నుండి రైతులకు యూరియా అమ్మకాలు ఫర్టిలైజర్ యాప్ ద్వారా మాత్రమే సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ రైతు సమైక్య స్మార్ట్ ఫోన్ నుండి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఫెర్టిలైజర్ బుకింగ్ గురించి రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతు వేదికలలో మరియు గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు.

బుక్ చేసుకునే విధానం..

ప్రభుత్వ వ్యవసాయ శాఖ యాప్‌ను Install చేసి,యాప్ ఓపెన్ చేసి రైతు మొబైల్ నంబర్ నమోదు చేయాలనీ , మొబైల్ నంబర్ నమోదు చేశాక జిల్లా సెలక్ట్ చేయాలని ,తరువాత సెండ్ OTP క్లిక్ చేసి , ఫోన్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయాలన్నారు.ఇదే నంబర్ మీ పట్టదార్ పాసుబుక్‌తో లింక్ అయి ఉండాలనీ అన్నారు.రైతు భరోసా వెబ్‌సైట్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్నే ఉపయోగించాలనీ,ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే, రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద మార్చుకోవచ్చని తెలిపారు.

స్టెప్ 1. పంట వివరముల నమోదు:

OTP ఎంటర్ చేసాక స్టెప్ 1 లో భాగంగా రైతు పట్టదార్ పాసుబుక్‌‌ని సెలక్ట్ చేసి, వేసిన పంట వివరములను (వరి/పత్తి/మొక్కజొన్న etc.)ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో నమోదు చేయాలి. దీని ఆధారంగా యూరియా అర్హత (బస్తాల సంఖ్య) చూపిస్తుంది

స్టెప్ 2. యూరియా బుకింగ్:

భూమి విస్తీర్ణం ఆధారంగా విడతల వారీగా యూరియా బుకింగ్ చెసుకోవాలి. 1 ఎకరం వరకు– 1 విడత, 3 ఎకరాల వరకు– 2 విడతలు, 5 ఎకరాల వరకు– 3 విడతలు, 5 ఎకరాలకు పైగా – 4 విడతలలో యూరియా బుకింగ్ చేసుకోవాలి. మొదట మండలం, తర్వాత యూరియా బస్తాలు అందుబాటులో ఉన్న ఎరువుల దుకాణం (Retailer) ఎంచుకోవాలి. యూరియా బస్తాల సంఖ్య ఎంటర్ చేసి బుకింగ్ కన్ఫర్మేషన్ చేయాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత SMS / యాప్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో బుకింగ్ నంబర్, దుకాణం పేరు, గడువు (సాధారణంగా 24 గంటలు) ఉంటాయి. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోపే ఎరువుల దుకాణానికి వెళ్లి యూరియా బస్తాలు తీసుకోవాలి. 24 గంటల్లో తీసుకోకపోతే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవసరమైతే మళ్లీ కొత్తగా బుకింగ్ చేయాలి. ఒకసారి యూరియా తీసుకున్న తర్వాత రెండోసారి బుక్ చేసుకోవడానికి 15 రోజుల వ్యవధి ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సిబ్బంది, రైతులు ధరావత్ సాగర్, బికారు, ప్రభాకర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Next Story