- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Farmer Protest : పొలంలో రైతు వినూత్న నిరసన
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఎండుతున్న పంట పొలాన్ని చూసి ఓ రైతు వినూత్న నిరసన(Farmer Protest) చేశాడు. సూర్యాపేట(Suryapeta) జిల్లా మునగాల మండలం నేలమర్రిలో సుందరయ్య అనే రైతు ప్రభుత్వంపై కోపాన్ని వినూత్నంగా చూపించాడు. తనకున్న పొలం కాకుండా మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పొలం సాగు చేశాడు. ఎస్సారెస్సీ కాలువ(SRSC Canal) కింద నీళ్ళు వస్తాయనే ఆశతో పంట వేయగా.. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. పంట చివరి దశలో ఉండగా.. నీరు అందకపోవడంతో పొలం మొత్తం ఎండిపోయింది. ఎండిన తన పొలాన్ని మీడియాకు చూపిస్తూ.. నీళ్ళు లేక పొలం ఎలా ఎండిపోయిందో.. ఆ పొలంలో తన బైక్ తో చక్కర్లు కొట్టి చూపించాడు. అధిక పెట్టుబడుల కారణంగా అప్పుల పాలు అయ్యాయనని రైతు సుందరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరు అందించాలని వేడుకుంటున్నట్టు తెలియజేశాడు.
Next Story