భూ వివాదంలో రైతు మృతి.. ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల‌పై దాడులు

by Ratna Kumari |   (  Updated:2026-01-06 15:43:18  IST  )

భూ వివాదంలో గుండెపోటుతో మృతి చెందిన జోగునూరి లాజరస్ విషయం మరోవైపు తిరిగింది. తుంగతుర్తి పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమంది వాహనాలను అడ్డగించడమే కాకుండా దాడులకు పూనుకున్నారు.

భూ వివాదంలో  రైతు మృతి.. ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల‌పై దాడులు
X

దిశ, తుంగతుర్తి : భూ వివాదంలో గుండెపోటుతో మృతి చెందిన జోగునూరి లాజరస్ విషయం మరోవైపు తిరిగింది. తుంగతుర్తి పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమంది వాహనాలను అడ్డగించడమే కాకుండా దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలవ్వడమే కాకుండా వారి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ విషయమై ఎస్సై క్రాంతి కుమార్ మంగళవారం రాత్రి విలేకర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు. భూ వివాదం సంఘటనలో గుండెపోటుతో జోగునూరి లాజరస్ సోమవారం మృతి చెందగా.. మృత దేహాన్ని బంధువులతో పాటు పలువురు కలిసి అదే గ్రామానికి చెందిన సౌజన్య దేవి ఇంటి ముందు వేసి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంఘటనా స్థలానికి వెళ్లడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి సహకరించకుండా అక్కడున్నవారు శాంతి భద్రతల సమస్యను సృష్టించారు. ముందస్తుగా అక్కడున్న మృతుడు లాజరస్ కుటుంబ సభ్యులు, వారికి సహకరించిన కొంతమంది సహకరించే కొంతమంది ముందస్తుగా పథకం వేసుకున్నారు.పెట్రోల్ బాటిల్లు, కారం డబ్బాలు,కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో వారంతా పోలీసులపై దాడులకు పూనుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీస్ రిజర్వు విభాగంలో పని చేసే గజగంటి సందీప్ కు తీవ్ర గాయాలయ్యాయి. అర్వపల్లి,నాగారం మండలాలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు 23 మందితో పాటు రావులపల్లి గ్రామస్తుల్లో కొంతమందిపైన గాయపడ్డ పోలీస్ కానిస్టేబుల్ సందీప్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. ఇది ఇలా ఉంటే తొలుత మృతుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించాలని భావించారు.కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సూర్యాపేట ఏరియాకు చేర్చి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మంగళవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story