కేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన

by Kodari Anjali |

కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలంలోని కొత్తపేట గ్రామంలో "కేత్ బచావో అభియాన్" కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

కేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన
X

దిశ, మిర్యాలగూడ రూరల్: కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలంలోని కొత్తపేట గ్రామంలో "కేత్ బచావో అభియాన్" కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, వరిలో సమతుల్య ఎరువుల యాజమాన్యంపై రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయం పాటించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. నేల సారాన్ని కాపాడేందుకు, భూసార లక్షణాలను పెంపొందించేందుకు రైతులు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. అలాగే భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టడం వల్ల సాగు వ్యయాలు తగ్గి దిగుబడులు పెరుగుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ వ్యవసాయ అధికారి ఋషింద్రమణి, వ్యవసాయ విస్తరణ అధికారి పార్వతి పాల్గొన్నారు. అనంతరం రైతులకు మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా సేకరించాలో ప్రదర్శన ద్వారా వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story