- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక రైతు ఆత్మహత్య
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

దిశ, వలిగొండ: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుర్నాథ్ పల్లి గ్రామానికి చెందిన పంతుల రఘుపతి(42) అనే రైతు తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట వేశాడు. వరి పంట అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మానసిక వ్యధతో జీవితం మీద విరక్తితో ఈ నెల 24 న శనివారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో గడ్డిమందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు రఘుపతిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.






