భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

by Bhanu |

తమ భూమి తమకు కొంతకాలంగా రిజిస్ట్రేషన్ కాకుండా పోతుందని ఆందోళన చెందిన ఓ రైతు .. భూభారతి అవగాహన సదస్సులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, చింతలపాలెం : తమ భూమి తమకు కొంతకాలంగా రిజిస్ట్రేషన్ కాకుండా పోతుందని ఆందోళన చెందిన ఓ రైతు .. భూభారతి అవగాహన సదస్సులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. చింతలపాలెంలో మండలంలోని గుడి మల్కాపురం గ్రామానికి చెందిన దొంగల నాగరాజు అనే రైతు తనకు 187,290 సర్వే నెంబర్ లో భూమి ఉందని కానీ అది తనకు రిజిస్ట్రేషన్ కావడం లేదని మనస్థాపం చెంది రైతు భరోసా అవగాహన సదస్సులో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నవారు పోలీసులు ఆ పెట్రోల్ బాటిల్ ని తీసుకున్నారు. అంతలోనే ఆ సభకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ అక్కడికి చేరుకోవడంతో ఈ సంఘటన ఆయన దృష్టికి వెళ్ళింది.


వెంటనే బాధితులనితో మాట్లాడుతూ నీలాంటి భూముల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టం వచ్చిందని చెప్పారు. దీనివల్ల నిజమైన రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు... బాధితుడు నాగరాజు కు సంబంధించిన భూముల వివరాలను వెంటనే సేకరించి తనకు అందజేయాలని కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆర్డిఓ శ్రీనివాసులకు తాహసిల్దార్ సురేందర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. భూముల సమస్య ఉంటే దాన్ని పరిశీలించుకోవాలిగని ఆత్మహత్యకు పాల్పడితే సమస్య పరిష్కారం కాదని అన్నారు.సమన్వయంతో అధికారులను కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలని చెప్పారు.దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేస్తామన్నారు.


Next Story