- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ మోటార్ షాక్‌తో రైతు మృతి.. నేరేడుచర్లలో విషాదం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన విషాద సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది.

దిశ, నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన విషాద సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన నాగిరె శీను (58) అనే రైతు, విద్యుత్ మోటార్ పైనే పడి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. నారుమడిలో యూరియా వేయడం అనంతరం నీటిని మళ్లించేందుకు శీను పొలం సమీపంలోని వాగుపై ఉన్న విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయబోయాడు. అయితే విద్యుత్ సరఫరా మొదలైన క్షణాల్లోనే మోటార్‌కు షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. మోటార్‌కు దగ్గరగా ఉండగానే అతను విద్యుత్ షాక్‌కు గురై, మోటార్ పైనే కుప్పకూలిపోయాడు. ఈ ప్రమాదం తాలూకు దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో అత్యంత శ్రమజీవిగా పేరున్న శీను మరణంతో గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. అధికార యంత్రాంగం ఇలా ఎదురవుతున్న విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






