పొలంలో పనిచేస్తు రైతు మృతి..

by Bhanu |   (  Updated:2025-07-03 11:00:01  IST  )

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.

పొలంలో పనిచేస్తు రైతు మృతి..
X

దిశ, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో బురద పోలంలో పడిపోయి ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డేపల్లి సైదులు (40) గురువారం తన వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఆయన బురదలోనే పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

కాసేపటికి అక్కడికి వచ్చిన ఆయన భార్య, భర్తను పొలంలో పడి ఉండగా చూసి సమీప రైతుల సహాయంతో బయటకు తీసేలోపే అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపారు.


Next Story