- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నం.. నెల రోజులైనా కానీ కాంటాలు
సకాలంలో ధాన్యం తూకం కావడం లేదనే కారణంపై ఓ రైతు కొనుగోలు కేంద్రంలోనే పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బుధవారం జరిగింది.

దిశ, తుంగతుర్తి: సకాలంలో ధాన్యం తూకం కావడం లేదనే కారణంపై ఓ రైతు కొనుగోలు కేంద్రంలోనే పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బుధవారం జరిగింది. ఉప్పుల వెంకన్న అనే రైతు తన ధాన్యాన్ని గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో దాదాపు నెల రోజుల క్రితం పోశారు.అయితే వివిధ కారణాలవల్ల కాంటాలు కావడంలో ఆలస్యం ఏర్పడింది.బుధవారం కేంద్రానికి వచ్చిన రైతు పరిస్థితులన్నీ గ్రహించి తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను కొంత ధాన్యం రాశిపై పోశాడు.మిగిలిన పెట్రోల్ తనపై పోసుకోవడానికి సిద్ధం కాగా అక్కడే ఉన్న రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు వెంకన్న మాట్లాడుతూ తనకన్నా వెనుక వచ్చిన వారి ధాన్యానికి కాంటాలు జరుగుతున్నాయని వివరించారు.మ్యాచర్ వచ్చినా కూడా తూకాలు చేయలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన కొనుగోలు కేంద్రం హమాలీల ఇష్టారాజ్యంగా మారిందని రైతులు వాపోయారు. తమకు నచ్చిన వారికే హమాలీలు కాంటాలు వేస్తున్నారని ఆరోపించారు.సీరియల్ అనేది పోయిందని మండిపడ్డారు.వారి మోసాల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని రైతాంగం ఆరోపించింది.
కాగా విషయం తెలియగానే తహసిల్దార్ దయానందం పరిస్థితులను సమీక్షించారు.ఎస్సై క్రాంతి కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి రైతు వెంకన్నతో పాటు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడారు.రైతు వెంకన్న పరామర్శించి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఇలాంటి తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని పేర్కొన్నారు.అనంతరం కేంద్ర నిర్వాహకులతో మాట్లాడారు.ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టొద్దని నిర్వాహకులను హెచ్చరించారు.ఒత్తిడిలకు లొంగకుండా సీరియల్ ప్రకారం తూకాలు చేయాలని పేర్కొన్నారు.లారీల కొరత, తదితర సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎస్సై స్పష్టం చేశారు.వర్షం వల్ల ఈరోజు తూకం వేయలేకపోయామని నిర్వాహకులు ఎస్సై కి వివరించారు. అయితే ఇలాంటి సమస్యలు అన్నారం గ్రామంలో కొత్తేమీ కాదు. మొన్నటి ఖరీఫ్ సీజన్ లో కేంద్రం నుండి కోదాడ మిల్లుకు వెళ్లి తిరిగి వచ్చిన ధాన్యంతో కలత చెందిన రైతు ఒకరు తనతో పాటు తన భార్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది మర్చిపోకముందే ప్రస్తుతం జరిగిన సంఘటన పై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..అంతేకాకుండా గతంలో కాంటాలు కాకుండానే మిల్లులకు ధాన్యం తరలి వెళ్లిన విషయం రచ్చగా మారింది.






