- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నికి ఆహుతైన ఫామ్ ఆయిల్ తోట
మండల పరిధిలోని తూముకుంటలో ఓ రైతుకు చెందిన పామాయిల్ తోట అగ్నికి ఆహుతి అయింది.

X
దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని తూముకుంటలో ఓ రైతుకు చెందిన పామాయిల్ తోట అగ్నికి ఆహుతి అయింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే రైతు ఆరు ఎకరాలలో పామ్ఆయిల్ తోటను సాగు చేస్తున్నారు. మంగళవారం అటుగా వెళ్లిన కొందరు రైతులు అగ్నికి ఆహుతి అయినా తోటను చూసి సమాచారం ఇవ్వడంతో తోట వద్దకు వెళ్లి చూడగా తోట మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయిందని వాపోయారు. పామ్ఆయిల్ చెట్లతోపాటు డ్రిప్పు పైపులు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయని తెలిపారు. ఎవరైనా కావాలని అంటించారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందో తెలియటం లేదని ఇక్బాల్ అన్నారు.
Next Story






