నకిలీ బంగారం ముఠా అరెస్టు

by Nallavelli.Anjaneyulu |

నల్లగొండ జిల్లా కేంద్రంలో నకిలీ బంగారం అంటగట్టి మోసం చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

నకిలీ బంగారం ముఠా అరెస్టు
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలో నకిలీ బంగారం అంటగట్టి మోసం చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. తాజాగా న‌ల్ల‌గొండ డీఎస్పీ కే.శివ‌రాంరెడ్డి విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గత నెల డిసెంబర్ 16న నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారం ఇచ్చి, నగదు తీసుకుని ఉడాయించారు. నెహ్రూగంజ్ ప్రాంతంలోని వినాయక కిరాణా షాపు వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సరుకులు తీసుకొని, షాప్ యజమానితో పరిచయం పెంచుకున్నారు. మాటలు కలిపి రూ.15లక్షల విలువైన బంగారం కేవలం రూ.5లక్షలకే ఇస్తామని నమ్మించి, బ్యాంకు వద్దకు తీసుకెళ్లి రూ.5లక్షలు డ్రా చేయించి, ఆ నగదుతో నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించారు. బాధితుడు నకిలీ బంగారం అని గుర్తించి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం బజార్ లో రాజస్థాన్ రాష్ట్రం జూలూరు జిల్లాకు చెందిన రమేశ్ కుమార్, రాజా రామ్, పురన్ కుమార్, మహేంద్ర కుమార్, మానా రామ్, సురేశ్ కుమార్, దేవా రామ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. నిందుల వద్ద రూ.1.5లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్ టౌన్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్సైలు లచ్చి రెడ్డి, వెంకట నారాయణ, విష్ణు, రబ్బానీ, అంజయ్య, సి‌సి‌ఎస్ సిబ్బంది వహీద్, దస్తగిరి, మహేశ్, నాగరాణి తదితరులను డీఎస్పీ అభినందించారు.

Next Story