- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని గ్రామస్తుల నిరసన
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎమ్మార్వో కారుకు గ్రామస్థులు అడ్డు తగిలిన ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎమ్మార్వో కారుకు గ్రామస్థులు అడ్డు తగిలిన ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు (Chilukuru) మండల పరిధిలోని జానకీనగర్ తండా (Janakai Nagar Thanda)లో వ్యవసాయ భూమిలోకి వెళ్లే రోడ్డును కొలిచేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే, వచ్చిన అధికారులను సర్వే చేయకుండా ఓ వర్గం అడ్డుకోగా.. సర్వేను అడ్డుకున్నారని ఆరోపిస్తూ మరోవర్గం పరస్పరం ఘర్షణకు దిగాయి. దీంతో సర్వే చెయోద్దంటూ ఓ వర్గం చిలుకూరు ఎమ్మార్వో కారును అడ్డగించి ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, పరిస్థితి అదుపుతప్పడంతో జానకీనగర్ తండాలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సర్వే నిర్వహించాలని మరో వర్గం ఆందోళన ఇంకా కొససాగుతూనే ఉంది.






