- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Huge Explosion : యాదాద్రి పరిశ్రమలో పేలుడు.. ముగ్గురు మృతి, పలువురి పరిస్థితి విషమం
యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు(Huge Explosion) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు(Huge Explosion) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. అలాగే మరింతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. మోటకొండూర్ మండలం కాటపల్లి(Katapalli)లో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో నేడు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. మరికొంత మంది పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలిపారు. భారీ పేలుడు దాటికి పరిశ్రమ భవనం కుప్పకూలి పోవడం.. పేలుడు తీవ్రతకు అద్దం పడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంపెనీలో రియాక్టర్ బద్దలవడం వల్లే ఈ భారీ పేలుడు సంభవించినట్టు తెలియజేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.






