- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Explosive Compeny Incident : ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు... రూ.కోటి చొప్పున పరిహారం
Explosive Compeny Incident : ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు... రూ.కోటి చొప్పున పరిహారం
by Muthe.Rajitha |
యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని కాటపల్లి(Katapalli) వద్ద గల ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం భారీ పేలుడు(Reactor Explosion) సంభవించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని కాటపల్లి(Katapalli) వద్ద గల ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం భారీ పేలుడు(Reactor Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం(Exgratia) ప్రకటించింది కంపెనీ యాజమాన్యం. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది. గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, వైద్య ఖర్చులు అన్నీ తామే భరిస్తామని, అలాగే వేతనం కూడిన సెలవులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. కాగా మంగళవారం కంపెనీలో రియాక్టర్ పేలగా.. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలిపోయింది.
Next Story






