సమన్వయంతో పని చేస్తే అంతా సక్సెస్

by Taduka Kalyani |

అంతా సమన్వయంతో పని చేస్తే సక్సెస్ అవుతామని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ హరి సింగ్ పేర్కొన్నారు.

సమన్వయంతో పని చేస్తే అంతా సక్సెస్
X

దిశ,తుంగతుర్తి: అంతా సమన్వయంతో పని చేస్తే సక్సెస్ అవుతామని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ హరి సింగ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తుంగతుర్తి తహసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అన్ని రాజకీయ పార్టీలతో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో బిఎల్ఎ, బిఎల్ వో,అన్ని రాజకీయ పక్షాలు కలిసి పనిచేయాలని కోరారు. ఓటర్ జాబితాలో అర్హులైన వారందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాల్లో స్పష్టమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. వివిధ కారణాలతో అనర్హులైన వారి పేర్లను తొలగించాలని వివరించారు. సమావేశంలో తుంగతుర్తి, నూతనకల్, అర్వపల్లి,తిరుమలగిరి,శాలిగౌరారం,మోత్కూరు,అడ్డ గూడూరు,మద్దిరాల మండలాల తహసిల్దార్లు దయానందం, దేవేందర్ రావు,శ్రీకాంత్, పుష్ప, మాధవరావు, శ్రీదేవి, శ్రీనివాసరావు, తబిత తో పాటు డిటి కంట్లమయ్య, తదితరులు పాల్గొన్నారు.


Next Story