- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాలు ఆరికట్టడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి : సివిల్ జడ్జి జి.సబిత
దిశ, రామన్నపేట : బాల్య వివాహాలు ఆరికట్టడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష,

దిశ, రామన్నపేట : బాల్య వివాహాలు ఆరికట్టడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి డి.సత్తయ్యలు అన్నారు. మంగళవారం సీనియర్ సివిల్ కోర్టు అవరణంలో బాల్య వివాహాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుప్రీంకోర్టు గైడ్ లైన్ ల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు జరిగిన సర్వేలో తేలినట్లు, ఇలా బాల్య వివాహాలు జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ''బాల్ వివాహ్ ముక్తి భారత్ ''అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సు వారికి వచ్చే అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటదని, బాల్య వివాహాలు చేసిన వారికి, చేసుకున్న వారికి, సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు పడుతాయో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సహాయ న్యాయవాది ఎస్.సాయి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ మస్జిద్, సీనియర్ న్యాయవాదులు, సర్వీసెస్ టీమ్ సిబ్బంది, సభ్యులు, అంగన్ వాడి కేంద్రాల సూపర్వైజర్, టీచర్లు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






