- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వామ్యం కావాలి : సర్పంచ్ పంబాల స్వాతి
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వామ్యం కావడంతో గ్రామాభివృద్ధి త్వరగా సాధ్యం అవుతుందని తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పంబాల స్వాతి పేర్కొన్నారు.

దిశ, నేరేడుగొమ్ము : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వామ్యం కావడంతో గ్రామాభివృద్ధి త్వరగా సాధ్యం అవుతుందని తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పంబాల స్వాతి పేర్కొన్నారు. బుధవారం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ స్వాతి ఆధ్వర్యంలో ఆమె భర్త పంబాల ముత్యం స్వయంగా జేసీబీ నడుపుతూ గ్రామ రోడ్ల వెంట పెరిగిన చెట్లు, గడ్డి, చెత్త, చెదారాన్ని తొలగించారు. అలాగే తిమ్మాపురం ప్రాథమికోన్నత పాఠశాల ముందు కూడా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. చిన్న చిన్న శుభ్రతను పాటిస్తే.. గ్రామాన్ని ఆరోగ్యంగా మార్చవచ్చని తెలిపారు. అనంతరం సర్పంచ్ పంబాల స్వాతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చిన్న ప్రయత్నం పరిసరాలను పరిశుభ్రంగా చేస్తే.. ఆకర్షణీయంగా ఉంటుందని.. అలాగే ఎలాంటి రోగాలు కూడా దరిచేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర గ్రామాలకు మోడల్ గా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, ఉప సర్పంచ్ నీలం ఆంజనేయులు, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.






