- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఉద్యోగి ఎన్నికల్లో సక్రమంగా విధులు నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంగళవారం అవగాహన కల్పించారు.

దిశ, చౌటుప్పల్ టౌన్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూతులో ప్రాథమిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వెంటిలేషన్ కోసం కిటికీలు, తలుపులు, మరుగుదొడ్ల వసతి, ర్యాంపు వంటి అన్ని రకాల వసతులు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వహించాలని..సెలవులు పెట్టకూడదని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఎవరు ఉల్లంఘించినా సదరు ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల వివరాలను మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్ రెడ్డి అదనపు కలెక్టర్ కు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప, రఘుపతి, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ కార్యాలయ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.






