పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : స‌ర్పంచ్ ధీరావ‌త్ వెంక‌టేష్ నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంద్రియాల గ్రామ సర్పంచ్ దీరావత్ వెంకటేష్ నాయక్ అన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : స‌ర్పంచ్ ధీరావ‌త్ వెంక‌టేష్ నాయ‌క్
X

దిశ, భూదాన్ పోచంపల్లి : ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇంద్రియాల గ్రామ సర్పంచ్ దీరావత్ వెంకటేష్ నాయక్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎర్ర విక్రమ్, దొడ్డి సుధాకర్ పాల్గొన్నారు.

Next Story